‘మోదీ వేసిన డ్రెస్‌ మళ్లీ వేశారా..’

26 May, 2018 16:19 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా విశ్వాస ఘాతుకుడిగా మిగిలిపోయారని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా పెట్రోలు తగ్గడం లేదన్నారు. పాకిస్తాన్ మన బోర్డర్ దాటి ప్రజలను చంపుతుంటే ఏమైంది తమరి 56 ఇంచుల చాతి అని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడంలో మోదీ విఫలమయ్యారని, ఆయన  భారత ప్రధానా లేక ఉపరాష్ట్రపతి చెప్పినట్టు రాయబారా అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక వేసిన డ్రెస్‌ మళ్లీ వేశారా.. అలా వేసినట్టు నిరూపిస్తే 500 రూపాయలు బహుమతి ఇస్తానన్నారు. 

మరో వైపు కేసీఆర్‌ని చూస్తే స్వయంగా తుగ్లక్‌ని చూసిన భావన కలుగుతోందన్నారు. జోన్లు ఏర్పాటు చేసి ఉద్యోగుల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి చెంచాలు, తాబేదార్లుగా మారిపోయారని ఆరోపించారు. అన్ని సంఘాలతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు స్పందించాలన్నారు. జోన్ల వ్యవస్థపై రాష్ట్రపతి దృష్టికి తీసుకెళతామరి తెలిపారు.
 

మరిన్ని వార్తలు