‘కేసీఆర్‌ వైఖరిపై మళ్లీ కోర్టు కెళతాం’

8 Jun, 2018 14:49 IST|Sakshi
కేసీఆర్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసినా, వారి సభ్యత్వాలు పునరుద్ధరించడం లేదని ఆయన మండిపడ్డారు. సీఎల్పీ నాయకుడు, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి నివాసంలో శుక్రవారం జరిగిన సీఎల్పీ భేటీ అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్‌పై కోర్టు ధిక్కరణ కింద మళ్లీ కోర్టుకు వెళతామని ప్రకటించారు. కోర్టు తీర్పుని గౌరవించని కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ప్రభుత్వ నియంతృత్వ వైఖరిపై మొదటగా గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ నెల 11న గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలుస్తామని వెల్లడించారు. రాష్ట్రపతిని కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను వివరిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు