నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌ సీపీ ఛార్జ్‌షీట్‌

8 Jun, 2018 14:44 IST|Sakshi

అధికారంలోకి చంద్రబాబు వచ్చాక మాట తప్పారు

నాలుగేళ్ల  పాలనలో అభివృద్ధి శూన్యం

ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు చతికిలపడ్డారు..

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌​ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. టీడీపీ సర్కార్‌లో అభివృద్ధి శూన్యమని, అందువల్లే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేస్తున్నామని వైఎస్సార్‌​సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే తప్ప, అంగుళం కూడా అభివృద్ధి లేదు. ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ దగ్గర నుంచీ, కీలక పాత్ర నిర్వహిస్తున్న వెంకయ్య నాయుడు దగ్గర నుంచీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, సీఎం కావాలని ఉవ్విళ్లు ఊరుతున్న చంద్రబాబు వరకూ ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు, పదేళ్లు ...కాదు పదిహేనేళ్లు కావాలని డిమాండ్‌ చేశారు. హోదా స్థానంలో ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు మాట్లాడారు.

నాలుగేళ్లు అయిన తర్వాత మాట మార్చి ఇప్పుడు కేంద్రాన్ని దుయ్యబడుతున్నారు.  ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్‌ సీపీ ఛార్జ్‌షీట్‌, టీడీపీ మ్యానిఫెస్టో దగ్గర పెట్టుకుని సరి చూసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు. బీజేపీ, జనసేన మద్దతు తీసుకుని గెలిచిన టీడీపీ... ఇప్పుడు బాబు హామీలు నెరవేర్చకపోవడంతో బీజేపీ, జనసేన పార్టీలు విడిపోయాయి. చంద్రబాబు ఇసుక, మైనింగ్‌, మద్యం మాఫియాను పెంచి పోషించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. రైతుల రుణమాఫీనే తొలిసంతకం అని ఊదరగొట్టిన చంద్రబాబు... ఇప్పుడు రైతాంగాన్ని చూసి సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు.

పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు