బిడ్డలంటూ సైకోలా కక్ష సాధింపా..

16 Oct, 2019 11:53 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు ఉపసంహరణ, మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు రెండూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంపపెట్టని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. బుధవారం స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ.. తండ్రి స్థానంలో ఉన్న కేసీఆర్‌ సైకోలా, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై మొండి వైఖరి సరికాదన్నారు. ఎన్నికల కంటే ప్రజలు, కార్మికుల పక్షానే సీపీఐ ఉంటుందని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెను సకలజనుల సమ్మెగా మార్చి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు