చెక్‌ ‘పవర్‌’ ఉండేనా?

15 Feb, 2019 11:59 IST|Sakshi
వల్లంపట్ల పంచాయతీ కార్యాలయం

ఉప సర్పంచ్‌ అధికారాలపై విడుదలకాని జీఓ 

పదవి దక్కించుకోవడం కోసం రూ.లక్షలు ఖర్చు చేసిన నాయకులు 

స్పష్టత లేక పోవడంతో ఆందోళన

మద్దూరు(హుస్నాబాద్‌) : పంచాయతీ కొత్త చట్టం ప్రకారం సర్పంచ్‌ ఉపసర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో ఉపసర్పంచ్‌ పదవులకు గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ పెరిగింది. ఈ పదవులను దక్కించుకొనేందుకు నాయకులు రూ.లక్షలలో ఖర్చులు చేశారు. అలాగే కొన్ని గ్రామాలలో సర్పంచ్‌ పదవులకు చేసిన ఖర్చులతో సమానంగా ఖర్చులు చేశాంటే ప్రభుత్వం ఉపసర్పంచ్‌కు చెక్‌ పవర్‌ కల్పిస్తామని చెప్పడంమే కారణం. అలాగే సర్పంచ్‌ పోటీలో ఉన్న ఆశావహులను ఉపసర్పంచ్‌ పదవులతో పార్టీలు బుజ్జగించిన సందర్భాలు ఉన్నాయి.  

వార్డు సభ్యుల అధిక ఖర్చులు.. 
మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలోని ఆశావహులు వార్డు సభ్యులుగా నామినేషన్‌ వేసిన నుంచే రూ.లక్షలలో ఖర్చులు చేశారు. ప్రతీ గ్రామం నుంచి మూడు వార్డులకు పైన ఎవరికీ వారే ఉపసర్పంచ్‌లగా భావించి అధిక మొత్తంలో ఖర్చులు చేశారు. అనంతరం గెలిచిన సభ్యులను ప్రలోభ పెట్టి ఉపసర్పంచ్‌లు అయిన సందర్భాలు ఉన్నాయి. అంత డిమాండ్‌ ఎందుకంటే కేవలం చెక్‌ పవర్‌ కోసమే. మరి ఇప్పుడు ఉపసర్పంచ్‌కు చెక్‌ పవర్‌ ఉంటుందా? లేదా? అన్న ఆందోళన అందరిలో నెలకొంది.
 
ఆలోచనలో ఉపసర్పంచులు.. 
సర్పంచ్‌ ఎన్నికలు ముగిసి కొత్త పంచాయితీల బాధ్యతలు స్వీకరించి పదిహేను రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు జాయింట్‌ చెక్‌ పవర్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి కాని, పంచాయతీరాజ్‌ కమిషన్‌ నుంచి కాని ఎలాంటి జీఓ రాక పోవడంతో ఉపసర్పంచ్‌లు ఎన్నికైన వారందరిలో రోజు రోజుకు టెన్షన్‌ పెరిగిపోతుంది. అలాగే ప్రజలు  ప్రస్తుతం ఉపసర్పంచ్‌ చెక్‌ పవర్‌పై చర్చలు సాగిస్తున్నారు. దీనికి తోడు మహిళ సర్పంచ్‌లు ఉన్న దగ్గర వార్డు మెంబర్‌లుగా పోటీ చేసి పదవులు దక్కించుకొన్నా నాయకులు ఆలోచనలో పడ్డారు.  ప్రతీ అభివృద్ధి పనిలో సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్‌పై సంతకం పెట్టాల్సి ఉండటంతో ఉపసర్పంచ్‌ల హవా ఉంటుందని చాల మంది లక్షలు ఖర్చులు చేశారు. ప్రభుత్వం మాత్రం ఇంక జీఓ విడదల చేయక పోవడంతో ఆందోళన చెందుతున్నారు.  

జీఓ విడుదలలో జాప్యం.. 
ఇంతకు ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉండేది. పంచాయితీ కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగి గనుక బాధ్యతతో నిధుల దుర్వినియోగం ఆరికట్ట వచ్చని వీరిద్దరికి చెక్‌ పవర్‌ ఇచ్చారు. కొత్త చట్టంలో మాత్రం పంచాయతీ కార్యదర్శికి బదులు ఉపసర్పంచ్‌కు చెక్‌ పవర్‌ ఉంటుందని చెప్నడమే తప్ప అధికారికంగా జీఓ విడదల కాలేదు. ఇదే ఇప్పడు చర్చకు దారి తీస్తుంది. హన్మతండాలో ఇప్పటి వరకు ఉప సర్పంచ్‌ ఎన్నిక కాక పోవడం కొస మెరుపు. 

మహిళా ఉప సర్పంచ్‌లే అధికం.. 
మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 13 మంది మహిళ సర్పంచ్‌లకు రిజర్వు అయ్యాయి దీనితో పాటు మండలంలోని 7 గ్రామ పంచాయతీలలో మహిళ ఉప్ప సర్పంచ్‌లుగా ఎన్నికై మహిళలల సత్తాను నిరూపించారు. అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ఉవ్విళ్లురుతున్నారు. 

చెక్‌ పవర్‌ ఇవ్వాలి.. 
ప్రభుత్వం చెపినట్లుగా ప్రజా ప్రతి నిధులను అభివృద్ధిలో భాగస్వాములు చేయుటకు సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్‌ పవర్‌ అందించి ఉప సర్పంచ్‌లను గౌరవించాలి. – సింగపాక బాలమ్మ, అర్జున్‌పట్ల ఉపసర్పంచ్‌  

అధికారిక సమాచారం లేదు.. 
గ్రామ పంచాయతీలలో చెక్‌ పవర్‌ ఎవ్వరెవ్వరికీ ఉంటుందనే విషయంపై ప్రభుత్వం నుంచి గాని పంచాయతీ రాజ్‌ కమిషన్‌ నుండి గాని ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. – శ్రీనివాస్‌ వర్మ, ఈఓపీఆర్డీ మద్దూరు

మరిన్ని వార్తలు