జనరల్‌ సీట్లో గెలిచినా అర్హులే

27 Dec, 2019 06:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్టీ, ఎస్సీ, బీసీలతోపాటు మహిళలకు రిజర్వ్‌ చేసిన మేయర్, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులకు ఆయా వర్గాలకు రిజర్వ్‌ స్థానం నుంచే కాకుండా జనరల్‌ సీటు నుంచి గెలిచిన వారు కూడా పోటీకి అర్హులే. జనవరిలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇదివరకే స్పష్టతనిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు, మహిళలకు రిజర్వ్‌ చేసిన చైర్మన్, మేయర్‌ పదవులకు సంబంధిత రిజర్వేషన్‌ స్థానం నుంచి కాకుండా జనరల్‌ స్థానం నుంచి సదరు కేటగిరికి చెందిన వ్యక్తి గెలిచినా ఆయా పదవులకు పోటీ చేసేందుకు అర్హులని స్పష్టతనిచ్చింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్‌ చేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులకు ఆయా కేటగిరీల వారు జనరల్‌ సీటు నుంచి పోటీచేసి గెలిచినా ఆయా పదవులకు పోటీ పడవచ్చునని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు