ఆదర్శప్రాయుడు ..చామల

20 Apr, 2018 12:43 IST|Sakshi
చామల యాదగిరిరెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

ఆయన సేవలు మరువలేనివి

మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి

స్వాతంత్య్ర సమరయోధుడు యాదగిరిరెడ్డి మృతికి పలువురు ప్రముఖుల సంతాపం

భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేని  ఆస్పత్రికి అప్పగింత

శాలిగౌరారం (నకిరేకల్‌) : ఆదర్శప్రాయుడు.. స్వాతంత్య్ర సమరయోధుడు చామల యాదగిరిరెడ్డి అని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మూడు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధి రామగిరిలో గల ఆయన స్వగృహంలో మృతిచెందారు. ఈ సందర్భంగా యాదగిరిరెడ్డి మృతదేహాన్ని గురువారం వారు వేర్వేరుగా సందర్శించి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  మండల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొని యాడారు. తన మరణాంతరం మృతదేహాన్ని  వైద్య విద్యార్థుల ప్రయోగార్థం కామినేని వైద్య కళాశాలకు అప్పగించేందుకు ముందస్తుగానే వీలునామా సిద్ధం చేసుకొన్న గొప్ప మానవతావాది అన్నారు.

యాదగిరిరెడ్డి మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారిలో తుంగతుర్తి, నకిరేకల్‌ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, రాష్ట్ర గిడ్డం గుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్, రాష్ట అటవీ అభివృద్ధిశాఖ చైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ అధి కార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర నాయకులు వేమవరపు మనోహరపంతులు, ఉమ్మడి రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌ సీవీఎన్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బోళ్ల నర్సింహారెడ్డి, మామిడి సర్వయ్య, జర్నలిస్టుల సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు