నాలుగున్నరేళ్లలో రూ.2 లక్షల కోట్లు లూటీ: శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజం

29 Nov, 2018 05:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారం అంతా అభూత కల్పనలేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో ప్రాజెక్టులతో పాటు ప్రతి ప్రభుత్వ పథకంలోనూ బొక్కారన్నారు. రూ.2 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆయన దుయ్యబట్టారు. తాజాగా పెన్నా– గోదావరి నదుల అనుసంధానం పేరుతో మరో అక్రమార్జనకు తెరతీస్తూ శంకుస్థాపన చేశాడన్నారు. తన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మాట్లాడే తీరు చూస్తుంటే పిల్లలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రాయలసీమ కరవుతో అల్లాడుతుంటే ఏనాడూ మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదన్నారు. పట్టిసీమ గురించి చంద్రబాబు రోజూ అబద్ధాలే చెబుతున్నాడని, కనీసం కృష్ణా డెల్టా కూడా ఈ నీళ్లు అందలేదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు కృష్ణా డెల్టాను ఆదుకుందని గుర్తు చేశారు. గోదావరిలో నీళ్లు లేకపోతే పులిచింతల నీటిని 50 రోజుల పాటు డెల్టాకు మళ్లించారని తెలిపారు. ఈ వాస్తవాన్ని మాత్రం చంద్రబాబు చెప్పడన్నారు.

మరిన్ని వార్తలు