మిమ్మల్ని ఎలా నమ్మాలి?

19 May, 2018 12:37 IST|Sakshi
గంగవరం లో మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌

పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించిన గంగవరం గ్రామస్తులు

గాజువాక/సీతంపేట/సాగర్‌నగర్‌/ పీఎంపాలెం: ‘ఇదే వేదికపై మీ మాటలు నమ్మి తెలుగుదేశానికి ఓట్లు వేశాం. ఇక్కడ పల్లా శ్రీనివాసరావును గెలిపించాం. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడుమిమ్మల్ని ఎలా నమ్మాలి?’విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరం మత్స్యకార గ్రామంలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై గ్రామస్తుడు కొర్లయ్య సంధించిన ప్రశ్న ఇది. దీనిపై స్పందించిన పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ  టీడీపీకి, బీజేపీ వారు సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే ఇప్పుడు ఆ పార్టీలను నిలదీయడానికి వచ్చానన్నారు.

గంగవరం కాలుష్యం సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. గంగవరం గ్రామంలోని నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గంగవరం పోర్టు కాలుష్యం వల్ల గ్రామంలో అందరి ఆరోగ్యాలు పాడవుతున్నాయన్నారు.  కాలుష్య సమస్య పరిష్కారమయ్యేవరకు  తాను అండగా ఉంటానని చెప్పారు. మీకు న్యాయం చేసే పార్టీలకే 2019లో ఓట్లు వేయాల’ని కోరారు. నాయకులు శేషు, ముసలయ్య, రాఘవరావు  పాల్గొన్నారు.

బుద్ధుడి పూజలు చేసిన పవన్‌
 జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బస చేసిన అంబేడ్కర్‌ భవన్‌ ఆవరణలో ఉన్న  బుద్ధ ప్రార్థనా మందిరాన్ని శుక్రవారం సందర్శించారు.  అలాగే సాగర్‌నగర్‌లో  పవన్‌ను మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, వట్టి వసంతకుమార్‌ కలిశారు. పలు అంశాలపై చర్చించారు.బçస్సు యాత్రకు బయలు దేరిన పవన్‌కల్యాణ్‌ పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి బస చేశారు. 

మరిన్ని వార్తలు