నేతన్నలకు గవర్నర్‌ నరసింహన్‌ భరోసా

7 Feb, 2018 16:59 IST|Sakshi
యాదాద్రి జిల్లా పోచంపల్లిలోని చేనేత మ్యూజియంలో గవర్నర్‌

అన్ని పథకాల్లో సబ్సిడీ అందేలా చూస్తానని హామీ

పోచంపల్లి చేనేత మ్యూజియాన్ని సందర్శించిన గవర్నర్‌

సాక్షి, యాదాద్రి : చేనేత కార్మికులకు అన్ని ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీ అమలయ్యేలా చూస్తానని నేతన్నలకు గవర్నర్‌ నరసింహన్‌ హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా పోచంపల్లిలోని చేనేత మ్యూజియంలో గవర్నర్‌ బుధవారం చేనేత సంఘాలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత ఉత్నత్తులకు మార్కెటింగ్‌ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నేతన్నలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించేలా చర్యలు చేపడతానన్నారు. చెనేత కార్మికులకు జియో టాగ్ నంబర్ కల్పిస్తామన్నారు. నిఫ్ట్‌ విద్యార్థులకు వివిధ చేనేత డిజైన్లపై పోచంపల్లిలో శిక్షణ ఇప్పించాల్సిందిగా అధికారులకు సూచించారు.

గురుకుల పాఠశాలను సందర్శించిన గవర్నర్‌

చౌటుప్పల్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను,దండు మల్కాపురం గ్రామంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మేల్యే ప్రభాకర్‌ రెడ్డితో కలిసి గవర్నర్‌ సందర్శించారు.

మరిన్ని వార్తలు