కోమటిరెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం

12 Mar, 2018 14:08 IST|Sakshi
హెడ్‌సెట్‌ విసురుతున్న కోమటిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై చర్యలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయమైన ఘటన వీడియో ఫుటేజీలను అసెంబ్లీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏడాది పాటు కోమటిరెడ్డిని అసెంబ్లీ నుంచి బహిష్కరించే అవకావం ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా మరికొందరు ఎమ్మెల్యేలపైనా వేటు పడనుందని తెలుస్తోంది. దీనిపై మంగళవారం సభలో తీర్మానం ప్రవేశ పెట్టే విధంగా ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

కాగా ఈ ఘటనపై మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యులు కావాలనే గొడవ చేశారన్నారు. సీఎం కేసీఆర్ ముందుగానే తమను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. బడ్జెట్ సమావేశాల నుంచి బహిష్కరణకు గురవ్వాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. సభలో జరిగిన ఘటనకు సబంధించిన వీడియోలు పరిశీలిస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్త: హెడ్‌సెట్‌ విసిరిన కోమటిరెడ్డి; చైర్మన్‌కు గాయం

మరిన్ని వార్తలు