ఓటు వేసింది బిర్యానీ తినడానికా?

28 Feb, 2018 13:00 IST|Sakshi
కె. రామకృష్ణ, కంభంపాటి హరిబాబు

ఎంపీ కంభంపాటిపై సీపీఐ నేత రామకృష్ణ ధ్వజం

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో లంచగొండి ప్రభుత్వం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాగుపడ్డారని.. పేదవాడికి ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వలేదని అన్నారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైల్వేజోన్ కోసం విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును ఢిల్లీ రమ్మంటే రాలేదని వెల్లడించారు. ప్రజలు ఆయనకు ఓటు వేసింది ఎందుకు? బిర్యానీ తినడానికా? అని ప్రశ్నించారు. ఏపికి ప్రధాని నరేంద్ర మోదీ అన్యాయం చేస్తున్నారని, సీఎం చంద్రబాబును పూచికపుల్లలా చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఇంత నష్టం జరగడానికి చంద్రబాబు, వెంకయ్య నాయుడు కారణమన్నారు.

మరిన్ని వార్తలు