నిరుద్యోగ భృతి కాదు.. ఉద్యోగాలు కావాలి : పవన్‌ కల్యాణ్‌

2 Jul, 2018 17:40 IST|Sakshi

విజయనగరం : నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అవసరం లేదని ఉద్యోగాలు కావాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్‌ కోటలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నిరుద్యోగంతో ఉత్తరాంధ్ర కొట్టుమిట్టాడుతోందని, బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ తనకొడుక్కి మాత్రమే జాబ్‌ వచ్చిందని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని  పోలవరం, పట్టిసీమలకు డబ్బులుంటాయి కానీ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్‌లకు మాత్రం డబ్బులుండవా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు టీడీపీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో స్థిరపడ్డ ఉత్తరాంధ్రకు చెందిన వెనుకబడిన 23 కులాలు బీసీ జాబితాలోకి రావడం లేదని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదన్నారు. తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు