కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాజకీయాలేనా?

25 Apr, 2020 04:30 IST|Sakshi

చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ధ్వజం

వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో మన రాష్ట్రమే ఫస్ట్‌

సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, కరోనా నియంత్రణ చర్యల విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనితీరుకు ప్రజలందరూ మద్దతు పలుకుతుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తట్టుకోలేక కువిమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఇంతటి విపత్కర పరిస్థితులలో ఆయన హైదరాబాద్‌లోని ఇంట్లో రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే.. 

► సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయి. కేవలం నాలు గు వారాల్లో తొమ్మిది పరీక్షల ల్యాబ్‌ లను ఏర్పాటు చేశాం. దేశంలో సగ టు పరీక్షల కన్నా మూడు రెట్లు అంటే రోజుకు 961 టెస్ట్‌లు చేస్తున్నాం. 
► ప్రతి జిల్లాలోనూ కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 7,900 మం ది క్వారంటైన్‌లో వున్నారు. వారికి అన్ని వసతులు అందుబాటులో ఉంచాం. 
► ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల ఆరోగ్యం కోసం సీఎం టెలీ మెడిసిన్‌ను ప్రారంభించారు. 
► ముఖ్యమంత్రి ఇతర దేశాల నుంచి ర్యాపిడ్‌ కిట్‌లను తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నారు. చివరికి దీనిపైన కూడా చంద్రబాబు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నాడు. 

ఆస్పత్రుల్లో సౌకర్యాలపై ఆరా 
విజయవాడ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కరోనా వైరస్‌ బాధితులో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. ఆస్పత్రిలో సదుపాయాలు, వైద్యం, అందిస్తున్న ఆహారంపై బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు