‘నందిగం సురేష్‌పై దాడి దుర్మార్గపు చర్య’

24 Feb, 2020 12:03 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాపట్ట ఎంపీ నందిగం సురేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు.  దళిత పార్లమెంట్ సభ్యునికే ఇలా అవమనం జరిగితే, 29 గ్రామాల్లో జరుగుతున్న రైతుల ఆందోళనను బాబు ఎలా నడిపిస్తున్నారో అర్ధమవుతుందని తెలిపారు. కాగా గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు మహిళలను ముందుపెట్టి ఎంపీ నందిగం సురేష్‌పై, ఆయన గన్‌మెన్, అనుచరులపై దాడి చేశారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. (ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి)

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది దుర్మార్గపు చర్యగా వ్యాఖ్యానించారు. వివిధ స్కాంలపై ప్రభుత్వం సిట్ వేసినప్పటి నుంచి చంద్రబాబులో అసహనం మరింత పెరిగిపోయిందన్నారు.  అరెస్ట్ తప్పదన్న భావనలో చంద్రబాబు అండ్ కో టీం వ్యహరిస్తోందని మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో జరిగిన భాగోతాలన్ని బట్ట బయలు అవుతాయన్న ఆలచోనతో నలుగురు, అయిదుగురు మహిళలను ఉసిగొల్పి నందిగామ సురేష్పై దాడి చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలపడంతో తీవ్ర అసహనానికి లోనైన చంద్రబాబు దాడులకు పురిగొల్పుతున్నారని అన్నారు. దోషులెవరైన కఠినంగా శిక్షిస్తామని, ఎ వరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటు మంత్రులు కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. 

ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి
రాష్ట్రమంతా సమగ్ర అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆలోచనతో ఉంటే, చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారయణ మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, ఘటన పై  ఎస్సీ. ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు తన చెత్త రాజకీయాలతో పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు, అబద్ధపు కథనాలు రాయిస్తున్నారని దుయ్యబట్టారు. నవరత్నాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజలంతా అండగా ఉన్నారని ఎంపీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు