‘ఎన్నికల కంటే ప్రజాస్వామ్యం ముఖ్యం’

16 May, 2018 09:04 IST|Sakshi
నరేంద్ర మోదీ (ఫైల్‌ ఫొటో)

కోల్‌కతా: పంచాయతీ ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రధాని మోదీ ఖండించారు. ఈ నెల 12 జరిగిన బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్‌, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది ఓటర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మోదీ బుదవారం స్పందించారు. ఎన్నికల కంటే ప్రజాస్వామ్యం ముఖ్యమని వ్యాఖ్యానించారు. అధికార తృణమూల్‌ బీజేపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుందని, ఇది ప్రజాస్వామ్యంపై దాడిలాంటిదని ఆరోపించారు. బెంగాల్‌ ప్రాంతం చాలా గొప్పదని అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికలు కూడా శాంతియుతంగా నిర్వహించుకోవాలని మోదీ తెలిపారు. ఇలాంటి ఘటనలను ఖండించాల్సిన అవసరముందని, వాటికి ఇంతటితో ముగింపు పలకాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఆరవైవేల మంది సిబ్బందిని  మోహరించినా కూడా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రతిపక్షాలు అధికార తృణమూల్‌పై విమర్శిల వర్షం కురిపిస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారాన్ని అడ్డంపెట్టుకుని హింసాత్మక ఘటనలను  ప్రోత్సహిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని త్నణమూల్‌ నేతలు భావిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు