అయోధ్యలో తొలిసారిగా మోదీ..

1 May, 2019 13:17 IST|Sakshi

అయోధ్య: రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి కేంద్రబిందువైన అయోధ్యలో నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అయోధ్యలో జరిగిన మెగార్యాలీలో ప్రసంగిస్తూ.. ప్రజల విశ్వాసానికి ఉగ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉందని, మన ప్రజల విశ్వాసాన్ని తాను కాపాడుతానని ప్రతిన బూనారు.

‘ఇది శ్రీరాముడి నేల. ఇది ఆత్మగౌరవానికి ప్రతీక అయిన నేల. గత ఐదేళ్లలో ఇక్కడి ఆత్మవిశ్వాసమే దేశమంతా విస్తరించింది. మేం 130 కోట్ల ప్రజల చేతులను ఏకం చేశాం. ఆ శక్తితో నవభారత స్వప్నం సాకారం చేసే దిశగా వడివడిగా సాగుతున్నాం’ అని పేర్కొన్నారు.

‘అది ఎస్పీ అయినా, బీఎస్పీ అయినా, కాంగ్రెస్‌ అయినా వాటి స్వభావం ఒక్కటే. బెహెన్‌జీ (బీఎస్పీ అధినేత్రి మాయావతి) అంబేద్కర్‌ సిద్ధాంతాలు ప్రవచిస్తారు. కానీ, అందుకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తారు. ఎస్పీ కూడా లోహియా సిద్ధాంతాలను ప్రవచిస్తుంది. కానీ తన హయాంలో యూపీలో శాంతిభద్రతలను ధ్వంసం చేసింది’ అని మోదీ అన్నారు.

అయితే, ప్రధానిగా అయోధ్య పర్యటనకు తొలిసారి వస్తున్నప్పికీ.. ఇక్కడి తాత్కాలిక రామమందిరాన్ని కానీ, హనుమాన్‌ గార్హి ఆలయాన్ని కానీ ఆయన సందర్శించే అవకాశం కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు