‘హ్యాపీ బర్త్‌డే రాహుల్‌’ : మోదీ

19 Jun, 2019 10:53 IST|Sakshi

న్యూఢిల్లీ : ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుడు రాహుల్‌ గాంధీకి ఆయురారోగ్యాల ప్రసాధించాలని కోరారు. ఇక తమ అధినేత పుట్టిన రోజును కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. పలు పార్టీల అధినేతలు, కార్యకర్తలు, అభిమానులు రాహుల్‌ గాంధీకి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెప్తున్నారు. ప్రజల్లో  రాహుల్ స్ఫూర్తి నింపిన ఐదు ఘటనలంటూ కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోను పోస్టు చేసింది. 

జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై నేడు (బుధవారం) సమావేశం జరగనుంది. ఏక కాలంలో ఎన్నికలతోపాటు కీలకమైన అంశాలపై చర్చించేందుకు జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక సభ్యుడున్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆహ్వానాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తిరస్కరించగా కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఇదే విషయంపై  యూపీఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని మీడియా ప్రశ్నించగా.. రేపు తెలుస్తుందని దాటవేశారు. మహాత్మాగాంధీ 150వ వర్థంతి, 2022లో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. 

మరిన్ని వార్తలు