25 Dec, 2018 10:28 IST|Sakshi
రాజ్‌ బబ్బర్‌

బీజేపీని హెచ్చరించిన కాంగ్రెస్‌ నేత రాజ్‌బబ్బర్‌

జైపూర్‌ : హనుమంతుడిపై బీజేపీ నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజ్‌బ్బర్‌ హితవు పలికారు. లేకుంటే ఆ హనుమంతుడే బీజేపీ లంకను కాల్చేస్తాడని హెచ్చరించారు. రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హనమంతుడు దళితుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హనమంతుడి కులం చర్చనీయాంశమైంది.

అదే బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ హనుమంతుడు బ్రాహ్మణుడంటే.. మరో ఎంపీ గిరిజనడన్నారు. ఇంకో బీజేపీ ఎమ్మెల్సీ ముస్లిం అంటే యూపీ మంత్రి జాట్‌ అన్నారు. ఇలా హనమంతుడి పేరును రాజకీయం చేయడంపై రాజ్‌బబ్బర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే హనుమంతుడిని ఇబ్బంది పెట్టినందుకు బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని, ఇలానే చేస్తే ఆ దేవుడు తన తోకతో బీజేపీ లంకను కాల్చేస్తాడని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు