‘డిప్యూటీ’ ఎంపికపై సర్వత్రా ఆసక్తి

9 Aug, 2018 11:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెద్దల సభలో నంబర్‌ 2 స్థానం ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్యసభ కాసేపటి ప్రారంభం కాగా.. డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక తీర్మానాన్ని చైర్మన్‌ వెంకయ్య నాయుడు చదివి వినిపించారు. అనంతరం ఓటింగ్‌ ప్రారంభమైంది. డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల బరిలో ఎన్డీయే కూటమి-కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఎన్నికకు దూరంగా ఉండాలని వైఎస్సార్‌ సీపీ(2), ఆప్‌(3), పీడీపీ(2), డీఎంకే(1) పార్టీలు నిర్ణయించాయి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య 244. ఓటింగ్‌కు దూరమైంది 8 మంది. దీంతో ఓటింగ్‌లో పాల్గొనేవారి సంఖ్య 236కి పడిపోయింది.

అందులో 125 మంది ఇదివరకే ఎన్డీయే అభ్యర్థికి మధ్దతును ప్రకటించారు. విపక్షాల అభ్యర్థికి 111 మంది మద్ధతు ఇస్తున్నారు. డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు ప్రస్తుతం కావాల్సిన మెజార్టీ మార్క్‌ 119. ఎన్డీయే కూటమి తరపున జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ కె. హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. రాహుల్‌ గాంధీ స్వయంగా సంప్రదించలేదని అలిగిన ఆప్‌.. చివరి నిమిషంలో ఓటింగ్‌కు దూరమైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు