గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

Published Thu, Aug 9 2018 11:33 AM

Silpa Chakrapani Reddy Criticize On Chandrababu Naidu Kurnool - Sakshi

శ్రీశైలం ప్రాజెక్ట్‌(కర్నూలు): రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆ పార్టీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం సున్నిపెంటలోని రెడ్ల కల్యాణ మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో  ఆయన మాట్లాడారు. డబ్బులకు అమ్ముడుపోయి, పార్టీలు మారే తత్త్వం తనది కాదని, ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా త్యాగం చేశానని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే  శ్రీశైలంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయిస్తామని హామీ ఇచ్చారు. దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాల పెంపునకు ఈఓతో మాట్లాడానని తెలిపారు. సున్నిపెంటలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. టీడీపీ తరహాలో శ్రీశైలం అభివృద్ధి చెందుతుందంటే అందులో తన కృషి , పట్టుదల ఉందన్నారు.
 
ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదా? 
శ్రీశైలం ప్రాజెక్ట్‌ కాలనీలో సమస్యలు తాండవిస్తున్నా.. పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. శాశ్వత మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది లేక వైద్యం అంతంత మాత్రమే అందుతుందన్నారు. ఆయుర్వేద ఆసుపత్రి , నూతన ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్రామంలో వీధి లైట్లు లేవని, ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయని, కరువు పనులు లేక పేదల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
 
అప్రమత్తంగా ఉండాలి.. 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్య పెడుతున్నారని, నిరుద్యోగ భృతి పేరిట మోసం చేస్తున్నారని శిల్పా విమర్శించారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, పార్టీ ›క్రియాశీలక కార్యకర్తలు, బూత్‌ కమిటీ కన్వీనర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ నాయకులు వట్టి వెంకటరెడ్డి, ఎమ్‌ఏ రజాక్, జింకా గుండయ్య యాదవ్, గవ్వల విష్ణు నారాయణ,  హనుమన్న, కృష్ణమోహన్‌ రెడ్డి, గౌస్‌ మొహద్దీన్, ప్రభావతి, పార్వతి, కుమారి, శంకర స్వామి, వెంకటేశ్వర్లు, హమీర్‌బాషా, అయ్యప్ప, శేఖర్‌ సాహు, కొండబాబు, మల్లికార్జున, సోమేష్, మలిక్షా వలి, దాసు, డి.మల్లికార్జున , ఎస్‌కె ఆరీఫ్, కోదండం, చిన్న అబిబు, సుబ్బన్న, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

1/1

సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు

Advertisement
Advertisement