టీడీపీలో గుబులు పుట్టిస్తున్న వర్మ పాట

22 Dec, 2018 13:43 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఎన్టీఆర్‌ జీవితంలోని కొంత భాగాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ నుంచే సంచలనంగా మారిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో మరింత కాక రేపుతోంది. సినిమా ప్రారంభించిన దగ్గర నుంచి నా సినిమాలో నిజంగా నిజాలు మాత్రమే చూపిస్తున్నానంటూ చెపుతూ వచ్చిన వర్మ తాజాగా వెన్నెపోటు పాటతో మరో బాంబు పేల్చాడు.

శుక్రవారం విడుదలైన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు పాటకు సోషల్‌ మీడియాలో అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. పాట విడుదలై 24 గంటలు కూడా గడవక ముందే  ఈ పాటను దాదాపు 9 లక్షల మందికి పైగా వీక్షించారు. దీంతో టీడీపీ వర్గాల్లో గుబులు మొదలైంది. నిజ జీవిత గాథలను తెరకెక్కించటంలో వర్మకు మంచి రికార్డ్ ఉంది.

దీంతో సినిమాలో వర్మ ఎలాంటి నిజాలను బయట పెడతాడో అని టీడీపీ వర్గాల్లో వణుకు పుడుతోంది. ఒక వర్గం వర్మపై కేసులు నమోదు చేస్తూ నిరసలకు దిగుతుంటే.. మరికొంత మంది వర్మ ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ముందు ముందు ఇంకెన్ని సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువవుతుందో చూడాలి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు