తెలంగాణ ఎన్నికలు.. మన అభ్యర్థులు ఏం చదివారంటే?

26 Nov, 2023 08:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ గడువు సమీపిస్తోంది. దీంతో, నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈసారి ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మూడో వంతుపైగా పట్టభద్రులు ఉన్నారు. 

ఇక, డిగ్రీతో పాటు న్యాయవాద విద్యను అభ్యసించిన వారు ఎక్కువగా ఉండగా వైద్యులు, ఇంజనీర్లు కూడా పోటీలో ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన వారూ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసలే చదవుకోనివారు, పదో తరగతిలోపే చదివిన వారు కూడా ప్రధాన పార్టీల్లో ఉన్నారు. 

అభ్యర్థుల విద్యార్హత వివరాలు ఇవే..
పదో తరగతి పాసైన అభ్యర్థుల సంఖ్య 441, 
ఇంటర్‌ పాసైన వారి సంఖ్య 330,
చదువుకోనివారి సంఖ్య 89,
ఐదో తరగతి పాసైన వారి సంఖ్య 91, 
ఎనిమిదో తరగతి పాసైన వారి సంఖ్య 117,
డిగ్రీ ఆపై చదివిన వారి సంఖ్య 1143,
డిప్లమా చదివిన వారి సంఖ్య 53,
డాక్టరేట్‌ ఉన్న వారి సంఖ్య 32.


  
 

మరిన్ని వార్తలు