పోలీస్‌ సిబ్బందిని వెనక్కి పంపిన రేవంత్‌

4 Nov, 2018 02:19 IST|Sakshi

కొడంగల్‌: తన భద్రత కోసం జిల్లా ఎస్పీ పం పించిన పోలీసు సిబ్బం దిని రేవంత్‌రెడ్డి శనివారం వెనక్కి పంపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పిం చాల్సి ఉండగా, జిల్లా పోలీసులను పంపించడంపై రేవంత్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను హైకోర్టులో అప్పీల్‌ చేయనున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారులకు చెప్పారు. అధికార పార్టీ ఆదేశాలతో పోలీస్‌ ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు