ట్రంప్‌ వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

23 Jul, 2019 12:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌ పరిష్కారంపై మధ్యవర్తిత్వం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. కశ్మీర్‌ విషయంలో ట్రంప్‌తో ఏం చర్చించారో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్‌, ఇత ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకొమ్మని ఎలా అడుతుతారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్‌ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ఇచ్చాయి. లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ మాట్లాడుతూ.. అమెరికా ముందు భార‌త్ దాసోహం అయ్యింద‌న్నారు. మ‌నం బ‌ల‌హీనులం కాదు, దీనిపై ప్ర‌ధాని వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కాగా కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను ప్రధాని మోదీ కోరలేదని రాజ్యసభలో కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు.

(చదవండి : కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌)

>
మరిన్ని వార్తలు