హిందూసేన పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

11 May, 2018 03:05 IST|Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటకలో మతం పేరుతో ఓట్లడుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని, ఆ పార్టీ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రీయ హిందూసేన అధినేత ప్రమోద్‌ ముతాలిక్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ గురువారం ఈ పిటిషన్‌ను విచారించింది. ముస్లింల కోసం మదర్సా బోర్డు, క్రైస్తవులకు క్రిస్టియన్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్‌ ఓట్లడుగుతోందని లాయర్‌ వాదించారు.కాగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవని బెంచ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు