చంద్రగిరిలో రీపోలింగ్‌పై టీడీపీ ఆందోళన

16 May, 2019 11:46 IST|Sakshi

సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్‌ బూత్‌ల్లో రీ పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. టీడీపీ శ్రేణులు గురువారం ఉదయం పెద్ద ఎత్తున తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్దకు  చేరుకుని ధర్నాకు దిగారు. రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశాలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. 

కాగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్‌ కమ్మపల్లి (పోలింగ్‌ స్టేషన్‌ 321), పుల్లివర్తిపల్లి (104), కొత్త కండ్రిగ (316), కమ్మపల్లి (318), వెంకటాపురం (313) పోలింగ్‌ స్టేషన్లలో పార్లమెంట్‌, శాసనసభలకు ఈ నెల 19న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. అధికార తెలుగుదేశం పార్టీ ఈ అయిదు బూత్‌ల్లోకి ఇతరులను లోనికి రానీకుండా రిగ్గింగ్‌ చేశారంటూ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: (చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల 19న రీ–పోలింగ్‌)

మరిన్ని వార్తలు