ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

28 Feb, 2019 15:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామనేషన్ల పర్వం ముగిసింది. మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మల్లేశం బరిలోకి దిగగా.. టీఆర్‌ఎస్‌ మద్దతుతో మిత్రపక్షం ఎంఐఎం నుంచి మీర్జా రియజ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

ఇక, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ నుంచి గుడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ తన సంఖ్యాబలం ఆధారంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను అలవోకగా గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశముంది. అయితే, పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండటంతో క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా మొత్తం ఐదు స్థానాలు తామే గెలుచుకుంటామని టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది.

మరిన్ని వార్తలు