‘జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు వదల్లేదు’

4 Oct, 2019 17:14 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : సోషల్‌ మీడియాలో వస్తున్న కామెంట్లపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చకు సిద్దమా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై సోషల్‌ మీడియాలో తప్పుడు రాతలు రాయించింది చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయం, బాలకృష్ణ ఆఫీస్‌ నుంచి వైఎస్సార్‌సీపీపై తప్పుడు పోస్టింగ్‌లు చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌.. సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 

చంద్రబాబు మీడియాతో మాట్లాడిన తీరును ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని చెప్పారు. మహిళలు వినలేని మాటలను చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్‌ను సీఎంకు, వైఎస్సార్‌సీపీకి ముడి పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు మీద ఎవరైనా తప్పుడు పోస్టింగ్‌లు పెడితే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని సూచించారు. చంద్రబాబు మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని.. ఆయనను వెంటనే వైద్యులకు చూపించాలని అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల విష వృక్షమని.. సోషల్‌ మీడియాలో సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా వదల్లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించడాన్ని చంద్రబాబు జీర్ణించుకుకోలేకపోతున్నారని విమర్శించారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకోస్తున్న విప్లవాత్మక మార్పులు చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. (చదవండి: క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా?)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ

‘అన్ని స్థానాల్లో చిత్తుగా మేము ఓడిపోతాం’

సిగ్గులేని బతుకులు ఎవరివో చెప్పమంటే..

పీసీసీ పదవికి ఆయన సమర్థుడే : కమల్‌నాథ్‌

టీడీపీకి ఊహించని దెబ్బ

బాధ్యతలు స్వీకరించిన మంత్రి ‘గంగుల’

టిక్‌ టాక్‌ స్టార్‌కు బంపర్‌ ఆఫర్‌

లగ్జరీగానే చిన్నమ్మ

బీజేపీలోకి వీరేందర్‌ గౌడ్‌ 

కాళేశ్వరం ముమ్మాటికీ వైఫల్యమే

భీమిలిలో టీడీపీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

శివసేనకు పూర్వవైభవం వస్తుందా?  

దేవినేని ఉమా బుద్ధి మారదా?

‘హుజుర్‌నగర్‌’పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

‘బాబుపై.. డీజీపీ చర్యలు తీసుకోవాలి’

‘చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి’

చంద్రబాబుకు విడదల రజనీ సవాల్‌

మహాత్మా.. అనాథల్ని చేసి వెళ్లిపోయావా!!

‘దద్దమ్మల పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీనే’

హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..

అందుకే బీజేపీలో చేరుతున్నా : వీరేందర్‌ గౌడ్‌

పడవ నుంచి అమాంతం పడిపోయిన ఎంపీ..!

ప్రియాంకగాంధీకి షాకిచ్చిన ఎమ్మెల్యే!

ఆదిత్య ఠాక్రేకు తిరుగుండదా?

బీజేపీకి చెక్‌ పెట్టేందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతు

ఎంపీలకు చీర, గాజులు పంపుతా

కాంగ్రెస్‌కు టీజేఎస్, టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు

ఒక్క మహిళను ఓడించడానికి ఇన్ని కుట్రలా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్‌ టీం సక్సెస్‌ పార్టీ..

అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌