బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ 

20 Mar, 2019 09:30 IST|Sakshi

ఇద్దరు మంత్రులు, 12మంది ఎమ్మెల్యేలు  బీజేపీకి రాజీనామా

ఈటా నగర్‌:  భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.  మరో  కొద్ది రోజుల్లో  ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావాహుల సెగ తగిలింది. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీకి ఏకకాకలంలో ఎన్నికలు నిర్వహిస్తున్న  సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో  టికెట్లు  ఆశించి భంగపడిన ఇద్దరు బీజేపి మంత్రులు, భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసారు.  తమకు టికెట్‌ నిరాకరించడంతో ఏకంగా ఇద్దరు మంత్రులు , 12 మంది  శాసన సభ్యులు సహా  మొత్తం 18 మంది ప్రముఖులు  బీజేపీకి రాజీనామా చేసి...నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)లో చేరారు.  

హోంమంత్రి కుమార్ వైయి, పర్యాటక శాఖ మంత్రి జర్కర్, మాజీ బీజేపీ ప్రధాన కార్యదర్శి జర్పుమ్ గాంలిన్ బీజేపీకి గుడ్‌ బై చెప్పారు. వీరంతా ఇటానగర్‌లో మేఘాలయ ముఖ్యమంత్రి కొండ్రా సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌సీపీ)లో చేరారు. తప్పుడు సిద్ధాంతాలు, అబద్దాలతో పూర్వ వైభవాన్ని బీజేపీ కోల్పోయిందని, ముఖ్యంగా మైనారిటీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మంత్రి కుమార్‌వాలి మండిపడ్డారు.  ఇది ప్రజల్లో తీవ్ర ఆందోళనకుదారి తీసిందన్నారు.  ఈ ఎన్నికల్లో పోటీ చేయడమేకాదు.. ఎన్‌పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేస్తామన్ని ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 

అటు ఈ పరిణామంపై ఎన్‌పీపీ సంతోషం వ్యక్తం చేసింది. ఎన్‌పీపీ ప్రధాన కార్యదర్శి, అరుణాచల ప్రదేశ్ ఇన్‌చార్జ్‌ థామస్ సంగ్మా మాట్లాడుతూ 60మంది సభ్యుల అసెంబ్లీలో కనీసం 30-40 సీట్లను గెల్చుకుని  అధికార పీఠాన్ని దక్కించుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు