-

‘జగనన్న అమ్మఒడి’  చరిత్రాత్మక పథకం

9 Jan, 2020 14:31 IST|Sakshi

సాక్షి, అమరావతి:జగనన్న అమ్మఒడి’  ఒక చరిత్రాత్మక పథకమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార‍్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రశంసించారు. ‘రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశలో అమ్మ ఒడి దేశానికే దిక్సూచి అవుతుంది. 43 లక్షలమంది విద్యార్థుల తల్లులకు ఏటా 6,455 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా అందించడం అసాధారణ విషయం. పిల్లలను స్కూల్‌కు పంపడం ఎవరికీ భారం అనిపించదు’ అని ఆయన గురువారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

చదవండి‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

పాకిస్తాన్ చెరలో 14 నెలల పాటు నరకం అనుభవించిన మత్స్యకారులు ముఖ్యమంత్రి చొరవతో విడుదలయ్యారు. వాళ్లంతా సొంత ఊళ్లకు చేరి సంబరాలు జరుపుకుంటుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని దాడులు, అరాచకాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. వ్యవసాయం దండగ, ఉచిత కరెంట్‌ ఇస్తే వైర్లపై బట్టలు ఆరేసుకోవడం తప్ప సరఫరా ఉండదని హేళన చేశారని, సహకార పాల సంఘాలన్నిటిని దెబ్బకొట్టి తన హెరిటేజ్ డెయిరీని డెవలప్ చేసుకున్నరని చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇప్పుడు బినామీల భూముల కోసం రైతుల పేరుతో నాటకాలాడుతున్నారు... వాటే విజన్ బాబ్జీ! అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు