'బాబు.. విగ్రహం కళ్లలోకి చూసే దండ వేశావా'

29 May, 2020 17:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని టీడీపీ నిర్వహించిన మహానాడుపై విమర్శలు సంధించారు. ' ఎన్టీఆర్ జయంతి నాడు ఆయన విగ్రహం కళ్ళల్లోకి చూసే దండ వేశావా? నీ కంట్లో ఒక చుక్క అయినా నీరు వచ్చిందా? పాపం కదా...! ' అంటూ పేర్కొన్నారు. కాగా మరో ట్వీట్‌లో ' నిన్న, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తే.. పగిలిపోయిన సైకిల్ ట్యూబ్కు, లారీ టైరుకు గాలి కొట్టే మిషన్‌తో గాలి కొడుతున్నట్టు ఉంది. ఎవరి పిచ్చి వారికి ఆనందం..' అంటూ తెలిపారు.
అన్నిటికీ సీఎంను తప్పుబట్టడం సరికాదు: రామ్‌మాధవ్

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా