‘అసత్య ఆరోపణలు చేయలేదు. అవినీతికి పాల్పడలేదు’

21 Apr, 2020 12:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : గతి భారతి ఫౌండేషన్ ద్వారా కొందరు స్నేహితుల సహాయంతో ప్రజలకు సహాయం చేస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. డబ్బుల కోసం తాము ఫౌండేషన్ నడపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తనెప్పుడూ అసత్య ఆరోపణలు చేయ్యలేదని, అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఇందుకు ఏ ఆలయం వద్దనైనా ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. ఎప్పుడూ తెలిసి అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేసి చెప్పారు. (పోలీసుల కోసం ఉన్నంతలోనే ఉదారత.. )

ప్రస్తుతం కొన్ని బ్యాంకులు విలీనం చెయ్యడం.. ఆర్థికంగా చితికి పోవడం లాంటి దుస్థితి సుజనా చౌదరి లాంటి వ్యక్తుల వల్లే జరుగుతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. సుజనా చౌదరి రింగ్ ఎంట్రీలు చేసి ఎలా బోగస్ కంపెనీలు సృష్టించారో ఆధారాలతో సహా రుజువు చేయగలనని స్పష్టం చేశారు. కేంద్రంతో రాష్ట్రానికి మంచి సంబంధాలు ఉన్నా.. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులు కన్నా లక్ష్మీనారాయణ ఎంత వరకు దుర్వినియోగం చేశారో తాను లెక్కల్లో చెప్పగలనని అన్నారు. రూ.20 కోట్లకు కన్నా అమ్ముడు పోయారని చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. (జర్నలిస్ట్‌ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి: కవిత)

కేంద్రం ఇచ్చిన ఎన్నికల నిధులు గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి ఎంత దారి మల్లించారో తన దగ్గర లెక్కలు ఉన్నాయన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారంతా బీజేపీకి నష్టం కలిగిస్తున్నారని, కళ్లు ముసుకొని పిల్లి పాలు తాగి ఎవరూ చూడలేదని అనుకుంటుందని.. సుజనా, కన్నా లాంటి అవినీతి పరులు ఇప్పుడు అలాగే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా )

మరిన్ని వార్తలు