‘చంద్రబాబు కోటరీలో వణుకు మొదలైంది’

21 Jul, 2019 11:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: అవినీతి రహిత పాలన కోసం​ జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబు కోటరీ వెన్నులో వణుకు మొదలైందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.

‘‘చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏనాడూ కౌలు రైతుల వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం వైఎస్‌ జగన్ 15.30 లక్షల మంది కౌలుదార్లకు రైతు భరోసాతో పాటు అన్ని పథకాలు వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. నాయకుడికి, భ్రమలు కల్పించి నాటకాలాడే వారికి తేడా ఇదే మరి. జుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, విద్యుత్తు పీపీఏలపై సమీక్ష వంటి నిర్ణయాలతో చంద్రబాబు, ఆయన కోటరీకి వెన్నులో వణుకు మొదలైంది. రూపాయి కూడా అవినీతి జరగలేదని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. కొందరు పార్టీ మారి ఎస్కేప్ రూట్ పట్టారు. ఏం చేసినా తప్పించుకోలేరు’’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు