ఎన్నికల సంఘం కమిషనర్‌పై నీచరాజకీయం

12 Apr, 2020 20:47 IST|Sakshi

సాక్షి, అమరావతి  : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం కమిషనర్‌ జస్టిస్‌ కనగరాజ్‌పై పచ్చ పార్టీ అనుకూల సోషల్‌ మీడియా నీచ రాజకీయానికి దిగింది. మతం పేరుతో సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది. దళిత  రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్‌ను అవమానించేలా.. హిందువుని క్రిస్టియన్‌గా చూపిస్తూ తప్పుడు ఫోటోలతో సర్క్యూలేషన్‌ చేస్తోంది. ఓ చర్చి ఫాదర్‌ ఫోటోను ఎన్నికల సంఘం కమిషనర్‌ ఫోటోగా పెట్టి దుష్ప్రచారానికి దిగింది. రెండ్రోజుల నుంచి సోషల్‌ మీడియాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా పోస్టింగ్‌లు పెడుతోంది.

పచ్చ పార్టీ అనుకూల సోషల్‌ మీడియా అబద్దపు ప్రచారాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా శనివారం బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ కనగరాజ్‌ ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన తన ఛాంబర్‌కే పరిమితమయ్యారు.

మరిన్ని వార్తలు