రాకూన్‌.. ఇక నుంచి నిన్ను ఫాలో అవుతాం | Sakshi
Sakshi News home page

రాకూన్‌.. ఇక నుంచి నిన్ను ఫాలో అవుతాం

Published Sun, Apr 12 2020 9:48 PM

Coronavirus : Parveen Kaswan Shares Video How Raccoon Washing Hands - Sakshi

కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను తరిమికొట్టాలంటే ప్రతీ ఒక్కరు తమ చేతులను ఎన్నిసార్లు కడుక్కుంటే అంత మంచిదని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అలా చెప్పడమే ఆలస్యం..   టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఉన్న సెలబ్రిటీలు ముందుకొచ్చి చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటూ, సురక్షితంగా ఉండాలంటూ  ప్రచారం చేస్తున్నారు. నిజానికి సరైన పారిశుధ్యం లేకపోవడం వల్ల మన దేశంలో రోజూ 500 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 8వేలు దాటేసింది. కరోనా వైరస్ మన చేతులకు అంటుకున్నా.. అది పోవాలంటే... సబ్బుతో చేతులు 20 సెకండ్ల పాటు కడుక్కోవాలి. ఇలా ప్రతీ 2 గంటలకు ఒకసారైనా ఈ పని చేస్తూ ఉండాలి. దీని కోసం హ్యాండ్ వాష్ ఛాలెంజ్ కూడా వచ్చింది.

ఈ పరిస్థితుల మధ్య ఓ రాకూన్... స్వయంగా చేతుల్ని కడుక్కున్న వీడియో వైరల్ అయ్యింది. అది ముందుగా మామూలు నీళ్లతో చేతులు కడుక్కొని... తర్వాత సబ్బు నీటిలో చేతుల్ని కడుక్కొని... మళ్లీ మామూలు నీళ్లలో చేతులు కడుక్కుంది. ఇదీ చేతులు కడుక్కునే విధానం ఇలా ఉంటుందంటూ చూపించింది. అమెరికన్లు ఈ రాకూన్లను ఇష్టంగా పెంచుకుంటారు. ఇవి చాలా ముద్గుగా ఉంటాయి. చిన్నగా అల్లరి చేస్తాయి. ఈ రాకూన్ వీడియోని ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కశ్వాన్‌ షేర్ చేశారు. 'ఈ జంతువు చేతులు ఎలా కడగాలనేది చేసి చూపెట్టింది. రాకూన్‌ చేసిన పనిని ప్రతీ ఒక్కరు ఫాలో అవుదాం' అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement