‘కేంద్రం తీరు చట్టం స్ఫూర్తికే విఘాతం’

25 Jul, 2018 20:51 IST|Sakshi
విజయసాయి రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ విభజన చ‍ట్టంలోని అంశాలను చాలా వరకు అమలు చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం రాజ్యసభలో తెలిపారు. ఏపీ విభజన బిల్లుపై కాంగ్రెస్‌ సభ్యుడు ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. షెడ్యూల్‌ 13లోని ఆంశాలు అమలు వివిధ దశల్లో ఉన్నట్లు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి కొంత సమయం పడుతోందని మంత్రి తెలిపారు. సెక్షన్‌ ప్రకారం 13వ షెడ్యూల్‌లోని అంశాలను పదేళ్లలో పూర్తి చేయాలని చట్టంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
విభజన చట్టంలో పొందుపరిచినట్లు విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం స్ఫూర్తికే విఘాతం కలిగించేలా కేంద్ర కాలయాపన చేస్తోందని వ్యాఖ్యానించారు. తక్షణమే గిరిజన వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన చట్టసవరణ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు