అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది : మళ్ల విజయప్రసాద్‌

3 May, 2019 11:50 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం :  పోస్టల్ బ్యాలట్ విషయంలో విశాఖ జిల్లాలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని వైఎస్సార్‌ సీపీ నేత, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీకి పోస్టల్ బ్యాలట్ అందడంతోనే భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరి టెలి కాన్ఫరెన్సు నిర్వహించారని తెలిపారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకొకపోవడం దారుణమన్నారు. కౌంటింగ్ సమయంలో మరో ఐఎఎస్ అధికారిని విశాఖలో నియమించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతునున్నట్లు తెలిపారు.

అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది : మళ్ల విజయప్రసాద్‌
అధికార టీడీపీ పార్టీ ఓటమి భయంతో  అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మళ్ల విజయప్రసాద్‌ ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎత్తుగడలను ఎదుర్కోవడానికి వైఎస్సార్‌ సీపీ శ్రేణులను శిక్షణకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.  

తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి : విజయనిర్మల
ఫొని తుఫాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్‌ సీపీ నేత అక్కరమాని విజయనిర్మల డిమాండ్‌ చేశారు. జాలారిపేట, శివ గణేష్ నగర్లో కొట్టుకుపోయిన బోట్లు, వలలకు పరిహారంగా కొత్తవాటిని మత్స్యకారులకు అందించాలన్నారు.

మరిన్ని వార్తలు