పోలీసుల జులుం.. సొమ్మసిల్లిన వైస్సార్‌సీపీ నేత

17 Nov, 2018 15:46 IST|Sakshi

సాక్షి, కర్నూలు : ప్రజా సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దీంతో కర్నూలు జిల్లా పరిషత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

వివరాలు.. జడ్పీ సర్వసభ్య సమావేశంలో సాగు, తాగునీటి సమస్యలపై గళమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల దాడిలో కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షులు బి.వై.రామయ్య సొమ్మసిల్లి పడిపోయారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు