ఏం సాధించారని చంద్రబాబు సంబరాలు?

24 Jan, 2020 11:30 IST|Sakshi

సాక్షి,  విశాఖపట్నం: శానసమండలిలో పరిణామాలను మేధావులు, ప్రజలు బ్లాక్‌ డే గా భావిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. మండలి ఛైర్మన్‌ నిర్ణయం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. శుక్రవారం విశాఖలో గుడివాడ అమర్నాథ్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..‘తాను తప్పు చేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మనే ఒప్పుకున్నారు. ఆయన తీరును మేధావులు కూడా తప్పుబట్టారు.

బీజేపీ, పీడీఎఫ్‌ సభ్యులు కూడా నిబంధనల ప్రకారం వెళ్లాలని ఛైర్మన్‌కు సూచించారు. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చుని ఛైర‍్మన్‌ను కనుసైగలతో శాసించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా మండలి ఛైర్మన్‌ వ్యవహరించారు. ఆయన నిర్ణయం వల్ల కొంత ఆలస్యం మాత్రమే జరుగుతుంది. ఏం సాధించారని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాని ఖునీ చేసినందుకా ఆనందోత్సాహాలు? (వీధిన పడ్డపెద్ద సభ పరువు)

మూడు గ్రామాలకే చంద్రబాబు హీరో
ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలి. మండలి గురించి సోమవారం అసెంబ్లీలో చర్చిస్తాం. చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో.. 13 జిల్లాలకు విలన్‌. ఆయన పనికిరాని వారిని శాసనమండలికి తీసుకు వచ్చారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్ధా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీని చేశారు. స్పీకర్‌గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు సభలో మైక్‌ ఇవ్వని మీరా రూల్స్‌ గురించి మాట్లాడేది? చంద్రబాబు చేస్తున్న పోరాటాలు తాత‍్కాలికమే. ఆయన కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు తాత దిగొచ్చినా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోలేరు. అయితే తన స్వార్థపూరిత రాజకీయాల కోసం మండలిని ఉపయోగించుకోవడం దారుణం. మండలిని ఆనాడు ఎన్టీఆర్ రద్దు ఎందుకు చేశారో అందరికీ తెలుసు. అయితే అర్ధవంతమైన సభగా పెద్దల సభ ఉండాలనే మంచి ఆలోచనలతో వైఎస్సార్ ఆనాడు శాసన మండలిని‌ పునరుద్దించారు. (చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!)

పవన్‌కి చంద్రబాబే ఆదర్శం
వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితంలో పవన్‌ కల్యాణ్‌ ఒంటరిగా వెళ్లలేరు. ఆయనది లాంగ్‌ మార్చ్‌ కాదు... రాంగ్‌ మార్చ్‌. పవన్‌కు వ్యక్తిత్వం, స్థిరత్వం, సిద్ధాంతాలు లేవు. మూడు రాజధానులు ఉంటే ఎందుకు తప్పు?  అయిదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్. రాజకీయ జీవితంలో...వ్యక్తిగత జీవితంలో పవన్‌కి పక్కన ఎవరో ఒకరుండాలి. పొత్తుల విషయంలో పవన్ కి చంద్రబాబే ఆదర్శం. గాజువాక ప్రజలు ఓడించారనే పవన్‌ కక్ష సాధిస్తున్నారు.’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (నిమిషాల వ్యవధిలో మాట మార్చిన పవన్)

>
మరిన్ని వార్తలు