రైల్వేమంత్రిని కలిసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీల బృందం

21 Aug, 2019 16:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ను కలిసింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపీల బృందం.. ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్ట్‌లపై చర్చించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వెంటనే నిధులను విడుదల చేయాలని.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఆయనను కోరారు.  దీనికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారని.. రాష్ట్రాభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని ఆయన తెలిపారు.

దుష్ప్రచారాన్ని నమ్మొద్దు..
అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో సంప్రదించి, వారి అనుమతితోనే రివర్స్‌ టెండరింగ్‌ చేస్తున్నామన్నారు.   టీడీపీ ప్రభుత్వం చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు. నారా లోకేష్‌ అవగాహన లేమితో ట్వీట్‌లు చేస్తున్నారని.. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసమే అమెరికాలో పర్యటిస్తున్నారన్నారు. ఆయన ట్వీట్లను చూస్తుంటే ఎవరో కార్యాలయ సిబ్బంది చేస్తున్నట్టుగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు