డబ్బున్నోళ్లా.. పేదోళ్లా.. ఫేస్‌బుక్‌ చెబుతోంది!

3 Feb, 2018 22:47 IST|Sakshi

లండన్‌: సోషల్‌ మీడియా సైట్‌ ఫేస్‌బుక్‌ చాటింగ్‌ కోసం, వీడియోలు, ఫొటోలు పంపేందుకు వినియోగిస్తుంటాం కదా. ఇక భవిష్యత్తులో తమ యూజర్లు ధనికులో.. లేక బీదవాళ్లో ఫేస్‌బుక్‌ వెల్లడించనుంది. అదేంటి నెటిజన్ల ఆర్థిక స్థితి గతులు ఎఫ్‌బీకి ఎలా తెలుస్తాయంటారా. ఈ విషయాలు వెల్లడించేందుకు కొత్త పేటెంట్‌ హక్కుల కోసం సంస్థ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. యూజర్ల వ్యక్తిగత విషయాలైన విద్య, సొంత ఇల్లు సమాచారం, ఇంటర్నెట్‌ వాడకం, ఇతరత్రా అంశాలను పరిశీలించిన తర్వాత మూడు రకాలుగా వ్యక్తుల ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది.

వర్కింగ్‌ క్లాస్ (శ్రామిక వర్గం)‌, మిడిల్‌ క్లాస్‌ (మధ్య తరగతి), అప్పర్‌ క్లాస్‌ (ధనిక వర్గం) అని మూడు రకాలుగా యూజర్ల స్థాయిలను ఫేస్‌బుక్‌ చూపిస్తుంది. 20- 30 ఏళ్ల మధ్య వయసున్న యూజర్లను ఇంటర్నెట్‌ డేటాను వినియోగిస్తున్నారో లెక్కలోకి తీసుకుంటుంది. 30-40 వయసు వర్గం వారిని సొంత ఇళ్లు ఉందా.. లేదా అన్న కాలమ్‌ ప్రశ్నిస్తుంది. మరిన్ని వయసు గ్రూపుల యూజర్ల కోసం మరికొన్ని అంశాలను పరిశీలించాలని ఫేస్‌బుక్‌ భావిస్తోంది. ఎన్ని మార్పులు జరిగినా కానీ, యూజర్ల వ్యక్తిగత సమాచారం మాత్రం గోప్యంగా ఉంటుందని మరోసారి సంస్థ స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు