లవ్‌ యూ బామ్మా

3 Dec, 2023 04:22 IST|Sakshi

వైరల్‌

85 సంవత్సరాల వయసులో కంటెంట్‌ క్రియేటర్‌గా మారింది విజయ నిశ్చల్‌. ఫ్రెంచ్‌ ఫ్రై, సమోస. గులాబ్‌ జామూన్, పొటాటో బాల్స్‌...ఒక్కటా రెండా ఎన్నెన్నో పసందైన వంటలను ఎలా చేయాలో తన చానల్‌ ద్వారా నేర్పుతుంది నిశ్చల్‌. వంటలు చేస్తూ ఆ వంటకు తగినట్లుగా హుషారుగా పాటలు పాడుతుంటుంది. ఈ బామ్మ చానల్‌కు 8.41 లక్షల ఫాలోవర్‌లు ఉన్నారు.

తాజాగా నిశ్చల్‌ బామ్మ చేసిన  ‘ఎగ్‌లెస్‌ కేక్‌’ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో 1.1 మిలియన్‌ల వ్యూస్‌ దక్కించుకుంది. ‘ఎగ్‌లెస్‌ కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను. మీ వీడియో చూసిన తరువాత నేను స్వయంగా చేశాను. ఇదంతా మీ చలవే. లవ్‌ యూ బామ్మా’ ‘వంటల్లో ఓనమాలు కూడా తెలియని నేను మీ వల్ల ఇప్పుడు ఎన్నో వంటలు చేయగలుగుతున్నాను. నా టాలెంట్‌ను చూసి ఫ్రెండ్స్‌ ప్రశంసిస్తున్నారు’... ఇలాంటి కామెంట్స్‌ ఎన్నో కనబడుతున్నాయి.

మరిన్ని వార్తలు