సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న చాలేంజ్‌

20 Jul, 2020 20:59 IST|Sakshi

లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వస్తే కరోనా పలకరిస్తుందనే భయంతో ఇళ్లలోనే గడిపారు. దాంతో ఇంటర్నెట్‌ వాడకం బాగా పెరిగిపోయింది. జనాలను ఎంటర్‌టైన్‌ చేయడానికి సోషల్‌ మీడియాలో పలు క్విజ్‌లు, గేమ్‌లు తెగ నడిచాయి. సాధారణంగా పులుల గురించి టాపిక్‌ వస్తే.. చితా, లియోపార్డ్‌, జాగ్వార్‌ వంటి పేర్లను వింటూ ఉంటాం. చూడ్డానికి అన్ని ఒకేలా ఉంటాయి. వాటి శరీరం మీద మచ్చల ఆధారంగానే ఏది ఏంటనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలో ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కస్వాన్‌ ఓ సరికొత్త చాలెంజ్‌తో నెటిజనుల ముందుకు వచ్చారు. ముఖం కనిపించకుండా తీసిన రెండు పులుల ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దాంతో పాటు.. ‘ఈ రెండింటింలో జాగ్వారేదో.. చిరుతేదో చెప్పగలరా?’ అంటూ ప్రశ్నించారు కస్వాన్‌.

అంతేకాకుండా ముఖం చూడకుండా.. కేవలం వాటి శరీరం మీద ఉన్న మచ్చల ఆధారంగానే తాము వీటి మధ్య తేడాను గుర్తిస్తామని తెలిపారు కస్వాన్‌. ప్రస్తుతం ఈ చాలెంజ్‌ తెగ వైరలవుతోంది. మరికొందరు నెటిజనుల దీనికి చిరుత ఫోటోను కూడా జత చేశారు. మీరు ఓ సారి ప్రయత్నించండి.(ఈ వీడియో భయంకరంగా ఉంది!)

మరిన్ని వార్తలు