సోషల్‌ మీడియా

24 Jan, 2019 00:25 IST|Sakshi

భయం
‘‘బీజేపీ అన్నా, ప్రధాని నరేంద్ర మోదీ అన్నా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భయపడుతున్నారు. సాధ్యమైనంత వరకు మా ర్యాలీలు, రథయాత్రలను అడ్డుకుంటున్నారు. కానీ, బీజేపీ బెంగాల్‌ ప్రజల హృదయాల్లో ఉందని నేను మమతకు గుర్తు చేయాలనుకుంటున్నా.  గడపగడపకూ వెళ్లి మీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను, అన్యాయాలను ప్రజలందరికీ వివరిస్తాం’’ – అమిత్‌ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు

అసలు రంగు
‘‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ను సొంతం చేసుకోవాలని బీజేపీ, సంఘ్‌ పరివార్‌ ఆరాటపడుతున్నాయి. కానీ, అంబేడ్కర్‌ మనవరాలి భర్త, మేధావి అయిన ఆనంద్‌ తేల్తుంబ్డే వ్యవహారంలో వారి ప్రజా వ్యతిరేక, దళిత వ్యతిరేక భావాలు బయటపడుతూనే ఉన్నాయి’’ – మీనా కందస్వామిరచయిత్రి

జ్ఞాపక చిహ్నం
‘‘ప్రధాని మోదీ కృషి వల్ల ఇప్పుడు ఢిల్లీలో సర్దార్‌ పటేల్‌ మ్యూజియం, అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంట ర్‌తోపాటు సుభాష్‌ చంద్రబోస్‌ మ్యూజి యం కూడా ఏర్పాటయ్యింది. మన జాతి ప్రయాణంలో ఎంతో కీలకపాత్ర పోషిం చిన ఈ నాయకులందరికీ దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఇప్పటి వరకు ఎందుకు జ్ఞాపక చిహ్నం లేదో అర్థం కాదు’’ – రవిశంకర్‌ ప్రసాద్, కేంద్ర మంత్రి

పౌరసత్వం
‘‘కుల, మత, వర్గాల వారీగా ప్రజల హృదయాలను విభజించాలనుకునేవారిపట్ల అంతా అప్రమత్తంగా ఉండాలి. చిట్టచివరికి వాళ్లు మనందరినీ మింగేస్తారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు భయపడాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పారు. ఇక మిగిలినది చొరబాటుదారులైన ముస్లింలు మాత్రమే. పౌరసత్వ సవరణ బిల్లు అనేది కేవలం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. మత ప్రాతిపదికన పౌరసత్వం అనేది భారతదేశానికి వ్యతిరేకం’’ – షోమా చౌదరిజర్నలిస్ట్‌

వినియోగం
‘‘నాకో వందకోట్ల రూపాయల గ్రాంట్‌ ఇవ్వండి. ఒక పౌరురాలిగా
ఆ మొత్తంతో ఎంత చక్కగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయొచ్చో చూపిస్తా. మనకింకా జ్ఞాపక చిహ్నాలు అవసరమా? మనకి కావాల్సినవి ఆసుపత్రులు, పాఠశాలలు’’ – శోభా డే, రచయిత్రి 

మరిన్ని వార్తలు