‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ కోసం ఆత్రుతగా ఉన్నా: స్మృతి ఇరానీ

30 Oct, 2019 21:19 IST|Sakshi

కేం‍ద్ర ప్రభుత్వంలో మంత్రిగా.. పరిపాలన,రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా స్మృతి ఇరానీ మాత్రం తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అంతేకాకుండా ట్రెండింగ్‌ విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తారు. వ్యంగ్యాస్త్రాలతోపాటు, ఫన్నీ పోస్ట్‌లతో తన ఫాలోవర్స్‌ను ఎప్పటికప్పుడు అలరిస్తారు. అయితే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కి 300 ఏళ్ల ముందు ప్రీక్వెల్ సెట్ చేసి గ్రీన్ లైటింగ్ చేస్తున్నట్టుగా హెచ్‌బీఓ ప్రకటించింది. అయితే దీనిపై స్పందించిన స్మృతి.. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ అభిమానుల్లో తాను ఒకరినని పేర్కొన్నారు.

అందులో జోన్‌ స్నో నటించిన ఒక సన్నివేశానికి సంబంధించిన మీమ్‌ను తన ఇస్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆ మీమ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ జోన్‌ స్నోకు ఎవరైనా చెప్పారా? గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌కి ప్రీక్వెల్‌ చేస్తున్నారని, అతని ముఖం సంతోషంతో నృత్యం చేస్తున్నట్టు ఉంది’ అని పేర్కొన్నారు. ఆమె ఇటీవల దీపావళి రోజు తిన్న మిఠాయిలు, తాను రోజు తీసుకునే ఆహారం.. వాటి మధ్య తేడాలు గమనించుకొని ఒకరినొకరు చూసి నవ్వుకున్నట్టు ఉన్న మీమ్‌ను పెట్టడంతో అది కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు