లాగిన్‌ కాకుంటే తొలగిస్తాం: ట్విటర్‌

27 Nov, 2019 14:42 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: మైక్రోబ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌.. యాక్టివ్‌గా లేని తన ఖాతాదారులకు వార్నింగ్‌ ఈ-మెయిల్స్‌ పంపుతోంది. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ట్విటర్‌ అకౌంట్‌ లాగిన్‌ చేయకుండా నిద్రాణవ్యవస్థలో(ఇన్‌యాక్టివ్‌) ఉన్న యూజర్‌నేమ్‌తో పాటు ఖాతాలను పూర్తిగా తొలగిస్తామని పేర్కొంది. అలా జరగకుండా ఉండాలంటే డిసెంబరు 11లోగా లాగిన్‌ అవ్వాలంటూ వినియోగదారులను ట్విటర్‌ హెచ్చరించింది.

వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు విశ్వసనీయ సమాచారం, కచ్చితత్వం కొరకు మాత్రమే తాము నిద్రావస్థలో ఉన్న ట్విటర్‌ అకౌంట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపింది. అయితే తాము ఒక్కసారిగా ఇన్‌యాక్టివ్‌ ట్విటర్‌ అకౌంట్‌లను తొలగించమని, తొలగింపు ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుందని ఈ మేరకు ట్విటర్‌ అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు. ట్విటర్‌ కస్టమర్లు యాక్టివ్‌గా ఉన్నంతవరకు వారి ఖాతా సేఫ్‌గా ఉంటాయని వివరించారు. ట్విటర్‌ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్విటర్‌ ఖాతాను మరిచినవారితో పాటు చనిపోయిన ఖాతాదారుల అకౌంట్‌లపై ప్రభావం కనిపించనుంది.

మరిన్ని వార్తలు