‘ఎక్స్‌’లో ఇక ఆడియో, వీడియో కాల్స్‌.. ఎలా ఆక్టివేట్‌ చేయాలంటే..

26 Oct, 2023 13:53 IST|Sakshi

టెక్నాలజీ కంపెనీల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. మెటా ఆధ్వర్యంలోని వాట్సప్‌ కొన్నేళ్లుగా ఆడియో, వీడియోకాల్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. అదే తరహాలో ఇపుడు మరో టెక్‌ దిగ్గజమైన ఎక్స్‌(ట్విటర్‌) ఆడియో, వీడియోకాల్‌ సౌకర్యాన్ని తన వినియోగదారులకు అందించనుంది. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఎలాన్‌మస్క్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే దీన్ని యాక్టివేట్‌ చేసుకోవాలంటే Settings->Privacy & Safety->Direct Messages-> Enable Audio & Video Calling ఫీచర్‌ని ఎనేబల్‌ చేసుకోవాలి.

(ఇదీ చదవండి: ప్రపంచంలోనే మేటి ఇండియన్‌ బీస్కూళ్లు..)

ఎవరికీ ఫోన్‌ నంబరు ఇవ్వకుండానే కాల్స్‌ చేసుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌ని ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్‌ ఫీచర్లను తీసుకురానున్నట్లు గతంలో మస్క్ ప్రకటించారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీల్లో ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.

మరిన్ని వార్తలు