భారత బౌలర్లు రాణించినా.. ఆసీస్కే!

29 Dec, 2014 17:50 IST|Sakshi
భారత బౌలర్లు రాణించినా.. ఆసీస్కే!

మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నాలుగో రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. అయితే ఈ రోజు ఉదయం భారత టెయిలెండర్లు విఫలం కావడం.. తొలి ఇన్నింగ్స్లో వెనకబడటం మనోళ్లకు ప్రతికూలాంశం. ఆసీస్ ఓవరాల్గా 326  పరుగుల ఆధిక్యంలో ఉండగా,  చేతిలో ఇంకా మూడు వికెట్లు ఉన్నాయి. దీంతో మ్యాచ్పై కంగారూలదే పైచేయి.  నాలుగో రోజు భారత బౌలర్లు రాణించినా ఆసీస్ మ్యాచ్ ను శాసించే స్థితిలో ఉంది.

సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఆట ముగిసేసరికి 7 వికెట్లకు 261 పరుగులు చేసింది. రోజర్స్ (69), షాన్ మార్ష్ (62 బ్యాటింగ్), డేవిడ్ వార్నర్ ((40) మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు.  మార్ష్తో పాటు హారిస్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లు అశ్విన్, ఇషాంత్, ఉమేష్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

462/8 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. . కోహ్లీ (169), రహానె (147) సెంచరీలు సాధించారు. హారిస్ 4, జాన్సన్ 3, నాథన్ లియోన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు