‘ఎ’ జట్ల రెండో టెస్టు డ్రా

11 Feb, 2020 03:18 IST|Sakshi

అజింక్య రహానే సెంచరీ

లింకన్‌: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే ‘ఎ’ జట్టు తరఫున అజేయ సెంచరీతో సత్తా చాటాడు. భారత్‌ ‘ఎ’, న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టు సోమవారం డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 234/1తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 467 పరుగులు చేసింది. అజింక్య రహానే (148 బంతుల్లో 101 నాటౌట్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) శతకం సాధించగా... విజయ్‌ శంకర్‌ (103 బంతుల్లో 66; 9 ఫోర్లు) రాణించాడు. ఆదివారం సెంచరీ పూర్తి చేసిన శుబ్‌మన్‌ గిల్‌ (136), చతేశ్వర్‌ పుజారా (66) తమ స్కోర్లకు మరికొన్ని పరుగులు జోడించారు. ఆంధ్ర వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎస్‌ భరత్‌ (22) విఫలమయ్యాడు. తాజా ఫలితంతో ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ 0–0తో డ్రాగా ముగిసింది.

>
మరిన్ని వార్తలు